 
    
కలిగిరి అక్టోబర్ 30 :(మన ధ్యాస న్యూస్ )://
కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో కేతినేని వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కేతినేని సాంబశివరావు – సుగుణ దంపతుల కుమార్తె తేజస్వి వివాహ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన గంధపు నలుగు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వధువు తేజస్వి ని స్వయంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వధువుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు నిండాలని, దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండిపోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు, స్నేహితులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
