 
    
అంబటి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!!!
కొండాపురం, అక్టోబర్ 30 :(మన ధ్యాస న్యూస్):///
కొండాపురం మండలంలోని కొమ్మి గ్రామంలో అంబటి వెంకటసుబ్బయ్య (లేట్)- రమణమ్మ కుమారుడు సునీల్ కుమార్ వివాహ మహోత్సవం ఆనందోత్సాహాలతో నిర్వహించబడింది. ఈ వివాహ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన “నలుగు కార్యక్రమం” లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని వరుడు సునీల్ కుమార్కు స్వయంగా అక్షంతలు వేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సునీల్ కుమార్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభసందర్భం ఎంతో ఆనందదాయకం. ఈ దంపతులు సుఖశాంతులతో, ఆనందాలతో, పరస్పర గౌరవంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు బంధుమిత్రులు, గ్రామస్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వరుడుని ఆశీర్వదించారు.
