మన న్యూస్: మీర్పేట్ పరిధిలోని నంది హిల్స్‌లో నిర్వాహకులు లక్ష్మి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటుచేసిన లక్ష్మీ బ్యూటీ సెలూన్ అండ్ ట్రైనింగ్ అకాడమీ ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ లక్ష్మి బ్యూటీ సెలూన్ ను అందరూ ఆదరించాలని కోరారు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని సూచించారు. మహిళ ఎవరిపై ఆధారపడకుండా తన సొంతకాలపై జీవించాలని అన్నారు. అనంతరం నిర్వాహకులు లక్ష్మీ మాట్లాడుతూ మా వద్ద మహిళలకు సంబంధించిన అన్ని రకాలైన బ్యూటీ సేవలు చేస్తామని అన్నారు. తాను 19 ఏళ్ల అనుభవంతో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అని అన్నారు. అలాగే తాము ట్రైనింగ్ కూడా ఇస్తామని అన్నారు. కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.