
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఓటర్ జాబితాలో మార్పు లు, చేర్పులు, తొలగింపులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశా లపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూ ల్లో బీఎల్ వోలకు సహకరించాలని,రాజ కీయ పార్టీల బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించుకోవాలని సూచించారు.అనంతరం నియోజక వర్గంలోని ఎనిమిది మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు జాబితా ప్రత్యేక పునఃసమీక్ష షెడ్యూల్ ఇచ్చినందున దానిపై పకడ్బందీగా,తప్పులు జరగకుండా సమీక్ష చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో తహశీల్దార్లు ఎండీ ముజీబ్, బి.అనిల్, వేణుగోపాల్ గౌడ్, లత, బిక్షపతి, మారుతి, రాజా నరేందర్ గౌడ్, నాయబ్ తహసీల్దార్లు శరత్, హేమలత, శివ రామకృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.