
మన ధ్యాస, నిజాంసాగర్ :( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్దిదారులు త్వరితగతిన పూర్తిచేయాలని మండల ప్రత్యేక అధికారి అరుణ అన్నారు.మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు.నిర్మాణ పనులను పరిశీలించి ఇంటి నిర్మాణ పనులను వేగవం తంగా కొనసాగించాలని విడతల వారీగా లబ్దిదారులకు ఖాతాలలో బిల్లులు జమవుతాయని అన్నారు. అనంతరం ఆమె గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు.ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి అంజయ్య, నాయకులు గంగి రమేష్ ఉన్నారు.