
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో బైడీల మైసమ్మ దాబా నిర్వాహకుడు చింతకింది శేఖర్ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఫిబ్రవరి 6న తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ ఐ శివకుమార్ తెలిపారు.బైండోవర్ ను ఉల్లంఘించి తన దాబాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆగస్టు 10న మద్యం సేవిస్తుండడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినందుకు రిపోర్ట్ ఇవ్వగా తహసీల్దార్ భిక్షపతి మంగళవారం చిందకింది శేఖర్ కు రూ.50 వేల జరిమానా విధించారు.