మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 6
రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు తిరుపతి సమీపం మంగళంలోని బీసీ ఎం స్కూల్ విద్యార్థి పూజిత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అండర్ 17 బేస్ బాల్ పోటీలలో బిసీఎం స్కూల్లో 9వ తరగతి చదివే కే పూజిత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపిక అవడం పట్ల ఆ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణమూర్తి నాయుడు హెడ్మాస్టర్ ప్రియా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో త్వరలో సింగపూర్ లో జరిగే పోటీలకు తమ పాఠశాల విద్యార్థిని ఎంపికైన విషయాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులను ఉపాధ్యాయులను వారి తల్లిదండ్రులను అభినందించారు.