.తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్.
భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చెందిన నలపరెడ్డిపల్లి యువకులు వార్డ్ మెంబెర్ ఎస్ నాగరాజా,ఎమ్ హరి, ఎస్ భువనేశ్వర్ బాబు,జగదీష్,సందీప్,చందు,బాభి, సతీష్, మదన్, వరుణ్,గౌతమ్ , ఆకాష్ , కళ్యాణ్, ఎస్ అరుణ్,కే.హరీష్ , పలువురు దళితనాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి దళిత నాయకులు నడవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు యువకులు నాయకులు పాల్గొన్నారు