మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని అప్పట్లో కార్యాలయానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరై మరమ్మత్తులు చేసి పెయింటింగ్ వేసి వదిలేశారు. కానీ ఎంపీడీవో కార్యాలయం పేరు రాయడం మరిచారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి పేరు లేకపోవడంతో కార్యాలయంకి వచ్చి వెళ్లే లబ్ధిదారులు కార్యాలయం పేరు తెలియక చుట్టుపక్క వాళ్లకు అడిగే కార్యాలయానికి వెళ్లే పరిస్థితి ఉంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయానికి పేరు రాయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.