మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పర్యటనలో భాగంగా ఆళ్లపల్లి రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి 25 మంది లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వివాహం చేసుకున్న మహిళ కుటుంబాలకు అండగా నిలిచేందుకు వారి కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల ద్వారా ఆర్థిక సాయం చేస్తుందని తెలియజేశారు కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు.ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల బీమా పథకాలతో రైతన్నలను ఆదుకుంటున్నామని రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాయం రామ నరసయ్య ,మాజీ ఎంపీపీ ,మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.