మన న్యూస్: పినపాక మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా శుక్రవారం పినపాక మండలంలోని జానంపేట గ్రామ శివారులో ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్ కమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లోని లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కొత్త వ్యక్తులు, అనుమానస్పదంగా ఎవరైనా సంచరిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని అసాంఘిక శక్తులకు ఎవరు సహకరించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.