
బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ కుటుంబాన్ని ఫోన్ప ద్వారా రామర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ..!బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వెంకయ్య నాయుడు హామీ..!
వింజమూరు అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ )://
హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఆ ప్రమాదంలో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన ఓకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన సంఘటన, తెలుసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదంలో మృతి చెందిన గోళ్ళ రమేష్ ,తండ్రి గోళ్ళ మాలకొండయ్యతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫోన్ ద్వారా మాట్లాడి ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని, మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. బాధితుడు మాలకొండయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రమాద విషయం తెలుసుకున్నప్పటి నుండి మా గ్రామంలోనే మా ఇంటి వద్ద ఉండి, ధైర్యం చెబుతూ, ఆందోళన చెందుతూ బాధపడుతున్నాడని కష్ట సమయంలో ఎమ్మెల్యే అండ మరువలేనిదని వెంకయ్య నాయుడు కి తెలియజేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని అడిగి ప్రమాద విషయాలను, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సహాయ చర్యల గురించి తెలుసుకున్నారు. మానవ ప్రాణాలు విలువైనవని లాంటి దుర్ఘటనలో మనందరికీ బాధ కలిగిస్తాయని ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దేవుడు వారికి ధైర్యం శాంతి కల్పించాలని ప్రార్థించారు.