
మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 23: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తూ ఈనెల 28వ తేదీ చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.........ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు అప్పనంగా కట్టబెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.ఇప్పటికే సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.కోవిడ్ సమయంలోనే కాకుండా గత ఐదేళ్లలో సచివాలయ వ్యవస్థ ఎలాంటి సేవలందించిందో ప్రజలందరికీ తెలుసు అన్నారు.అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా 44 వేల ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరించి.. వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని నిలిపివేసి.. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తుందన్నారు.గత ప్రభుత్వంలో మద్యం షాపులను పారదర్శకంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంటే.. ఈరోజు ప్రభుత్వం మద్యం షాపులన్నిటిని..టిడిపి నేతలకు కట్టబెట్టి.. పరిమిట్ రూములు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తుందన్నారు.ఈరోజు కూటమి ప్రభుత్వం పోర్టులను, రోడ్లు ఇలా అన్నింటినీ ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు.అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తున్నామని చెబుతూ.. వారికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కారు చౌకగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు.ఈరోజు ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలంటే సుమారు 500 నుంచి 800 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి.. మెడికల్ కళాశాల తీసుకురావడం ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు. ఈరోజు అలాంటి వ్యవస్థలను కారు చౌకగా ఎకరా వంద రూపాయలకు.. చంద్రబాబు నాయుడు వారికి సంబంధించిన వ్యక్తులకు ఎమ్మెల్యేలకు కట్టబెడుతున్న తీరును ఈరోజు ప్రజలందరూ. చూసి అసహ్యించుకుంటున్నారని అన్నారు.ఏ ప్రభుత్వమైన ఐదేళ్ల కాలంలో ఒక మెడికల్ కళాశాలను తీసుకురావడం అంటే.. విప్లవాత్మకమైన మార్పని అలాంటిది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశానని చెబుతున్న చంద్రబాబునాయుడు..ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు.స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమయ్యే వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే.. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలలను రాష్ట్రనికి తీసుకురావడం జరిగింది అన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి వాటన్నిటికీ సంబంధించిన అనుమతులను, జీ ఒ లను జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు. దశలవారీగా మెడికల్ కళాశాలలను పూర్తిచేయాలని సంకల్పంతో.. 8600 కోట్ల రూపాయల నిధులు సమీకరించి.. ప్రణాళిక బద్ధంగా వాటిని పూర్తిచేయాలని నిర్ణయించారని తెలిపారు.2023 ఏడాది కల్లా అయిదు మెడికల్ కళాశాలలు పూర్తి చేయాలి , అలాగే 2026 కు ఏడు కళాశాలలు ప్రారంభించాలి.. ఏదైతే నాడు నేడు లో 43 వేల ప్రభుత్వ పాఠశాలలను షెడ్యూల్స్ వేసుకొని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పని చేశారని తెలిపారు.చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి 2023 ఏడాదికీ ఐదు మెడికల్ కళాశాలను పూర్తి చేసి.. ప్రజలకు అంకితం చేశారని అన్నారు.అలాగే 2025 కి మరో ఐదు కళాశాలలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ.. 2024 లో ఒక మెడికల్ కళాశాలను పూర్తిచేయడం జరిగిందన్నారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మిగిలిన 10 మెడికల్ కళాశాలలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్న.. చంద్రబాబు నాయుడు.. వాటిని నేను పూర్తి చేయలేను.. ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు 25 ఏళ్లు సమయం పడుతుందని.. చెప్పి చంద్రబాబు నాయుడు వాటన్నింటినీ ప్రైవేటుకు అమ్మేస్తున్నానని నిస్సిగ్గుగా మాట్లాడిన తీరును ప్రజలందరూ అసహ్యించుకున్నారని అన్నారు.ఈ పరిస్థితుల్లో ప్రజలకు చంద్రబాబు నాయుడు.. సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు.10 మెడికల్ కళాశాలలు పూర్తి చేయాలంటే..4800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని..3 లక్షల కోట్ల మన రాష్ట్ర బడ్జెట్ లో 4800 కోట్లను ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ఖర్చు చేయలేదా ప్రజలకు చెప్పాలన్నారు.లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు.. వైద్య విద్యకు సంబంధించి.. పేదల ప్రజల ఆరోగ్యానికి సంబంధించి..4800 కోట్ల రూపాయలను దశలవారీగా ఖర్చు చేయలేరా చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు.. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో.. ఈ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి 60 వేల సంతకాలను సేకరించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే.. తాము నియోజకవర్గానికి లక్ష సంతకాలు చేపట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని.. చేపడుతున్నామని తెలిపారు.కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా.. ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుందని అన్నారు.ఎక్కడకు వెళ్లిన ప్రజలు చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయాలను.. తీవ్రంగా వ్యతిరేకిస్తు.. సంతకాలు చేస్తున్న తీరును చూస్తుంటే ఇవి కోటి సంతకాలు కాదు రెండు కోట్ల సంతకాలైన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీ ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో .. నిరసన ర్యాలీ చేపట్టి.. సమీపంలోని తాసిల్దారు, ఆర్డిఓ, డి ఆర్ ఒ కార్యాలయంలో అధికారులకు మెమోరాండం అందజేయడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను.. ఖండిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించామని.. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచుచుతామన్నారు.

