
కలిగిరి అక్టోబర్ 23 :(మన ధ్యాస న్యూస్)://
కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామానికి చెందిన లెక్కల రమణమూర్తి - విజయలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా ఆనందభరిత వాతావరణంలో సంతోషంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ గంధపు నలుగు వేడుకలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై, వరుడు జస్వంత్‌కు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన జస్వంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, జీవితంలో అన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, లెక్కల వారి కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా కొంత సమయం ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు, మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి,గ్రామ ప్రజలు, బంధుమిత్రులు, ఆత్మీయులు పాల్గొని వరుడును ఆశీర్వదించారు.