
మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తగిన గుర్తింపుని ఇస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్ల ఇన్చార్జిలు కార్యకర్తలతో మంత్రి నారాయణ ప్రత్యేకంగా మాట్లాడారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ డివిజన్ ఇన్చార్జి లకు మంత్రి దిశ నిర్దేశం చేశారు. కమిటీల నియామకంపై కార్యకర్తలకు నాయకులకు మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నాయకులకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటూ మంత్రి సూచించారు. రానున్న వర్షాలు నేపథ్యంలో కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు ,మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పిటిసి విజేత రెడ్డి, టిడిపి నెల్లూరు నగర అధ్యక్షుడు మామిడాల మధు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
