
మన ధ్యాస ,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23 :భారీ వర్షాల కారణంగా నెల్లూరు రూరల్ 27వ డివిజన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద ఉన్న అపార్ట్మెంట్ వాసులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ కాల్ చేయగా వెంటనే స్పందించి, సమస్య పరిష్కారం కోసం స్థానిక కార్పొరేటర్, స్థానిక నాయకులు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలసి పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. భారీ వర్షాల కారణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండవలసిందిగా కూటమి నాయకులకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ అవసరం వచ్చినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.సమస్య పరిష్కరించినందుకు స్థానిక అపార్ట్మెంట్ వాసులు, ప్రజలు రూరల్ ఎమ్మెల్యే కృతఙ్ఞతలు తెలియజేసారు. పై కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురహరి, టిడిపి నాయకులు ఉప్పు భాస్కర్, రమణ, సాజిత్, మోహన్, కుమార్, ఆది, కుమార్, తరుణ్, ప్రణీత్, జనసేన నాయకులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.