బంగారుపాళ్యం డిసెంబర్ 5 మన న్యూస్
బంగారుపాళ్యం మండలంలో స్కూటర్లను దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళ్యంకు చెందిన రాజేష్ (27) మండలంలోని రాగిమాను పెంట రోడ్డులో ఇంటి ముందు నిలిపి ఉన్న నాగరాజు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో నలగాంపల్లి బ్రిడ్జి వద్ద నిందితున్ని గురువారం అరెస్టు చేసి రూ. 1,40 లక్షల విలువైన రెండు పల్సర్ బైకులు సీజ్ చేశామని సీఐ తెలిపారు.