తవణంపల్లి డిసెంబరు 5 మన న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ యంత్రాంగం ద్వారా రెవెన్యూ సదస్సు పండుగ వాతావరణం గా మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని మండలంలోని ప్రజలు పాల్గొని సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తవణంపల్లి తహసిల్దార్ సుధాకర్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ సదస్సు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ యంత్రాంగం పూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంద ని అలాగే ప్రతి శాఖ నుండి ఒక అధికారిని నియమించడం జరిగిందని, ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని మొదటగా డిసెంబరు 6వ తేదీ గురువారం గోవిందరెడ్డి పల్లిలో రెవెన్యూ సదస్సు ప్రారంభించి జనవరి 9న రెవెన్యూ సదస్సులు ముగించడం జరుగుతుందని, తెలిపారు. అనంతరం మండలంలోని రైతుల భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను రెవిన్యూ సదస్సులో పూర్తిగా పరిష్కారం చేయబడుతుంద ని, అలాగే దారి సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, దేవాదాయ శాఖ భూముల సమస్యలు, అటవీ శాఖ భూముల సమస్యలు, భూ తగాదాల సమస్యలు, పలు రకాల సమస్యలను పరిష్కరించుట కు రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకొని పరిష్కరించే దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని సమస్యలను పరిష్కరించుకొని విజయంతం చేయాలని ఈ సందర్భంగా తహసిల్దార్ సుధాకర్ తెలిపారు.