
మన ధ్యాస, నిజాంసాగర్, అక్టోబర్ 22:
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండు గృహాలు లబ్ధిదారులకు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో అనిత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భారతి ఇండ్లకు ముగ్గు పోసి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ — గృహాలను త్వరగా నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు కూడా త్వరగా విడుదలవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుర్రపు శ్రీనివాస్, గుర్రపు వెంకటేశం, సాయిలు, గుర్రపు జయరామ్, రాజం గంగారం, చిన్నోల జగన్, కురుమ సాయిలు, కమ్మరకత్త అంజయ్య, దుర్గ కాశీరాం తదితరులు పాల్గొన్నారు.