మన న్యూస్ : ఉన్నత అధికారులకు తప్పుడు నివేదిక ను పంపిస్తున్న తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి బంధువులకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా. తాసిల్దార్ రమేష్ బాబు ను వెంటనే విధుల నుంచి తొలగించాలి నకిలీ పట్టాల సృష్టికర్త రామ్మూర్తి పై కేసు నమోదు చేసి వారికి ఉన్న నకిలీ పట్టాలను రద్దు చేయాలని వెదురుకుప్పం మండలం తాసిల్దార్ కార్యాలయం నందు గురువారం ఉదయం 11 గంటలకు తాసిల్దార్ రమేష్ బాబు ప్రజా వ్యతిరేకత విధానాన్ని నిరసిస్తూ ఉన్నారని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిరసించారు. ఈ నిరసన కార్యక్రమం సుమారు మూడు గంటల సమయం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురుకుప్పం తాసిల్దార్ రమేష్ బాబు ప్రజా సమస్యల పరిష్కరించకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను దోచుకుంటున్నారని డబ్బు ఇచ్చిన వారికే పనులు చేపడుతున్నారని తాసిల్దార్ పోస్టును ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారని తెలిపారు. సామాన్య ప్రజలను పట్టించుకోకుండా ఉపేక్షిస్తూ వ్యవహరిస్తున్నారని కొంతమంది బాధితులు కలెక్టర్ వారికి జాయింట్ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయగా అటువంటి వాటిని కూడా పరిశీలించి జిల్లా అధికార యంత్రంగానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఒక ఇంట్లో ఒకరికి ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరికీ డీకేటి పట్టా ఇచ్చారని ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా ఇస్తారని పేద ప్రజల భూములను ఇలా అప్పనంగా తమ బంధువులకు పంచి పెడుతున్నారని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ చెరువు మరియు చెరువుకు ఉన్నటువంటి తూము ను ఆక్రమించుకుంటున్నారని తాసిల్దార్ కు దళితులు తెలియజేస్తే చెరువులు నా యొక్క పరిధిలో లేదని చేతులెత్తేసారని ఆయన ఆరోపించారు. అలాగే దళితులకు దారి సమస్య పరిష్కరించమని జిల్లా కలెక్టర్ వారు ఆదేశించిన వారికి తప్పుడు సమాచారం పంపుతూ ఆ దారిలో కాలువలు ఉన్నాయని కాలవ నీటికి అద్దంకి కలుగుతుందని ఆ దారి ఇవ్వలేమని చెప్పారని అదే గ్రామంలో వాళ్ళ బంధుమిత్రులకు మాత్రం రెవెన్యూ పోలీస్ సిబ్బందితో కలిసి కాలవలేనే రోడ్డు వేసేందుకు తాసిల్దార్ చొరవతోపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు .బంధువులకు ఒక న్యాయము దళితులకు ఒక న్యాయమా తహసిల్దార్ ఇలా నిరంకుశంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని నిరసన తెలియజేశారు. ఇలాంటి తాసిల్దార్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి, బాబు, రాజేంద్ర, నాదముని ,మహాలక్ష్మి, ధనలక్ష్మి , గీత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.