
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 21:
నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ అంగన్వాడీ కేంద్ర స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తక్షణమే తొలగించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీలఆదేశించారు.మంగళవారం ఆమె బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ సిడిపిఓలతో కలిసి సుల్తాన్‌నగర్,హాసన్‌పల్లి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.అంగన్వాడీ హాజరు రిజిస్టర్లు,పరిశుభ్రత,ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.సుల్తాన్‌నగర్ కేంద్రం పక్కన గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మించడంతో కిటికీలు మూసుకుపోయి,కేంద్రంలో గాలి ప్రసరణ లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై అంగన్వాడీ టీచర్‌ను ప్రశ్నించారు.అంగన్వాడీ స్థలంలో నిర్మించిన కట్టడాన్ని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తహసీల్దార్, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేస్తామని ప్రమీల తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించి, చిన్నారులు,గర్భిణీలు, బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో బాన్స్వాడ ఐసిడిఎస్ సిడిపిఓ సౌభాగ్య, ఎల్లారెడ్డి అదనపు సిడిపిఓ ప్రసన్న,సూపర్ వైజర్ రాజేశ్వరి,అంగన్వాడీ టీచర్ సుశీల పాల్గొన్నారు.
