
మన ధ్యాస,నిజాంసాగర్:( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలంలోని గిర్ని తండాకు చెందిన కడావత్ రోజా బాయి ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు.ఈ సందర్భంగా మంగళవారం విజయ్–రోజా బాయి దంపతులను తండా వాసులు, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.కడావత్ రోజా బాయి సాధించిన విజయం తండాకు,మండలానికి గర్వకారణమని గ్రామస్థులు తెలిపారు.ఆమె కష్టపడి చదివి ఉన్నత స్థానం సంపాదించడాన్ని తాండా ప్రజలు ఆదర్శంగా భావిస్తున్నారని వారు అన్నారు.సన్మాన కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రాథోడ్,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కిషన్ రాథోడ్, శత్రు, షేక్ గౌస్, చందర్, ఎం.సుందర్, హరి సింగ్, సక్రు తదితరులు పాల్గొన్నారు.