మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు, మున్సిపాలిటీని మణుగూరు గ్రామ పంచాయతీ గా మార్చాలని ప్రముఖ సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సెంటర్ లో చేపట్టిన సంతకాల సేకరణ విజయవంతమైంది.తోలుత రవి నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, కొమరం భీమ్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి మున్సిపాలిటీని విలీనం చేసిగ్రామ పంచాయతీల ఏర్పాటుకు మద్దతు పలికారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలు, సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.అనంతరం రవి మాట్లాడుతూ.. గత పాలకుల అనాలోచిత విధా
నాల వల్ల అన్నారం, చిన్నరాయి గూడెం, కమలాపురం వంటి అనేక గ్రామాలనుమున్సిపాలిటీలో విలీనం చేశారని, నాటి పాలకులు తమ స్వాలభ కోసం మున్సిపాలి
టీకి అనేక కిలోమీటర్ల పరిధిలో గ్రామాలను కలిపి మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారని, ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీల్లో గిరిజన గ్రామాలలను విలీనం చేయడంపై అయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. మున్సిపాలిటీల ఏర్పాటుతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడి పన్నులు పెరుగాయని, పేదల బతుకులు దుర్భరంగా మారయన్నారు. ఉపాధి హామీ పథకం అనేకఅభివృద్ధిఫలాలుపేదలకుదక్కకుండాచేశారన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోకుండా మున్సిపాలిటీల్లో గ్రామాలను ఎలా కలిపారని ప్రశ్నించారు. ఇప్పటికే మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించాలని, చారిత్రక చరిత్ర కలిగిన మణుగూరు ను ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలన్నారు.లేనిచో భవిష్యత్తులో తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. సంతకాల సేకరణ, ప్రజా అభిప్రాయ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మద్దతును ప్రకటించిన
వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, వివిధ కుల సంఘాల, మహిళా, ఆదివాసి, ప్రజాసం
ఘాల నాయకులకు, పట్టణ ప్రము
ఖులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు…