
మాలేపాటి సుబ్బానాయుడు మరణం పార్టీకి తీరని లోటు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!మాలేపాటి సుబ్బానాయుడు అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల...
దగదర్తి, అక్టోబర్ 20 :(మన ధ్యాస న్యూస్)://
దగదర్తి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు పార్థివదేహానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఆయన అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన మాలేపాటి సుబ్బానాయుడు గారు పార్టీ శ్రేణులలో అంచెలంచలుగా ఎదిగి, కావలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విశేష సేవలు అందించారని క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన ఆయన, కపటంలేని నాయకుడిగా గుర్తింపు పొందారు.పార్టీ పటిష్టతకు, ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. సుబ్బానాయుడు మరణం పార్టీకి తీరని లోటు అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కాకర్ల సురేష్ ప్రార్థించారు.
