
వింజమూరు అక్టోబర్ 20 :(మన ధ్యాస న్యూస్)://
వింజమూరు పంచాయతీలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన గంగ పట్ల కొండయ్య , గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొండయ్య మృతి పట్ల సంతాపం తెలియజేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సోమవారం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10,000 రూపాయలు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి స్థానిక నాయకులు ఏగినేని శ్రీనివాసులు, పల్లాపు అరుణ అందజేశారు. పేద కుటుంబాలను ఆదుకోవడంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముందు ఉంటారని ఇలాంటి సేవకుడు మనకు దొరకడం అదృష్టం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.