
పదవిలో ఎంతకాలం వుంటే మాకు అంత మంచిది నూరు శాతం గిరిజన రక్తం ఆమెలో లేదు
మన ధ్యాస సాలూరు సెప్టెంబర్19: -గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి సంస్కారం, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ధ్వజమెత్తారు.ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.డిప్యూటీ సిఎం గా పనిచేసిన తనను, మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ని ఏకవచనంతో సంబోధిస్తూ ఆమె మాట్లాడిన తీరుపై రాజన్నదొర ఫైరయ్యారు.రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా,వందల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై రాష్ట్రం లో సిఎం, మంత్రులు గాడిదలు కాస్తున్నారా అని మాజీ సిఎం జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని అన్నారు.రాజకీయాల్లో విమర్శలు సాధారణమేనని, అంతకుముందు సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ కూడా అదే తరహాలో వ్యాఖ్యానించారని చెప్పారు.అప్పుడెందుకు టిడిపి నాయకులు స్పందించలేదని ప్రశ్నించారు.గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గా సంధ్యారాణి బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారని అన్నారు.మరణించిన ఇద్దరు గిరిజన విద్యార్ధినుల కుటుంబాలకు మట్టి ఖర్చులకు ఐదు వేలు ఇచ్చామని మంత్రి సంధ్యారాణి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.గిరిజనులు తమ పిల్లలను పాఠశాలలకు ఎన్నో ఆశలతో పంపిస్తున్నారని,కానీ శవాలు గా మారడానికి కాదన్నారు.మరణించిన విద్యార్ధుల కుటుంబాలను పరామర్శించనక్కరలేదన్న రీతిలో మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు వున్నాయని చెప్పారు.ఎక్కడో వున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గిరిజన విద్యార్థుల కుటుంబాలను ఎందుకు పరామర్శించారని చెప్పారు.50లక్షల పరిహారం చెల్లించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపడుతున్నాయని చెప్పారు.వైసిపి ప్రభుత్వం హయాంలో గిరిజన సంఘాలు ఎన్నడూ ఇంతలా ఆందోళనలు చేయలేదన్నారు.గురుకుల విద్యార్ధులు మరణించినప్పుడు మంత్రి సంధ్యారాణి స్థానికంగా వున్నప్పటికీ పరామర్శించకపోవడం బాధాకరమన్నారు.వైసిపి ప్రభుత్వం హయాంలో విద్యార్ధుల మరణాల ను ప్రభుత్వ హత్యలని గగ్గోలు పెట్టిన సంధ్యారాణి ఇప్పుడు జరుగుతున్న మరణాలు ప్రభుత్వ హత్యలు కావా అని నిలదీశారు.విద్యార్ధుల మరణాలకు, అస్వస్థతకు ఉపాధ్యాయులను బాధ్యులు చేయడం సరికాదని చెప్పారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పై జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఓ లు, మంత్రి సంధ్యారాణి ఎన్నిసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు.ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్ఎంల నియామకానికి సంబంధించి ఫైలు పై తొలి సంతకం చేశానని గొప్పలు చెప్పుకున్న మంత్రి సంధ్యారాణి ఎందుకు అమలు చేయలేదన్నారు.చేతకానప్పుడు రెండు మంత్రి పదవులు ఆమెకు అవసరమా అని ప్రశ్నించారు.మాటలాడితే అబద్ధాలు తప్ప నిజాలు ఆమె మాట్లాడడం లేదన్నారు.తన ఇంటి ముందు రోడ్డు వైసిపి ప్రభుత్వం హయాంలో మంజూరైతే టిడిపి ప్రభుత్వం హయాంలో పని జరిగిందని చెప్పారు.ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్ కి బిల్లు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు.తన హయాంలో జరిగిన రోడ్ల మీద కాకుండా నియోజకవర్గం లో మంత్రి సంధ్యారాణి తిరుగలేరని చెప్పారు.సంధ్యారాణి సొంత ఊరు కవిరి పిల్లికి రోడ్డు తానే మంజూరు చేయించానని చెప్పారు.మక్కువ రోడ్డు పని రెండు నెలల్లో చేయిస్తానని చెప్పిన మంత్రి 15నెలలైనా చేయలేదన్నారు. నియోజకవర్గంలో కొంతమంది గిరిజన సర్పంచ్ లను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, టిడిపి లోకి వస్తే రోడ్లు మంజూరు చేయిస్తానని చెపుతున్నారని ఆరోపించారు.మహిళల ఆత్మగౌరవాన్ని గుర్తు చేస్తూ మున్సిపాలిటీ లో సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని ఆమె ఆదేశాలిచ్చి ఏడాదిన్నర దాటిపోయిందని చెప్పారు.నూరు శాతం గిరిజన రక్తం ఆమెలో లేదు: మంత్రి సంధ్యారాణి లో నూరు శాతం గిరిజన రక్తం లేనందునే ఆమె గిరిజన చిరుద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.కరాసువలస కెజిబివి ఎస్ఓ ప్రశాంతి నిరుపేద పిటిజి గిరిజన మహిళని, అలాంటి ఉద్యోగిని కక్ష కట్టి సస్పెండ్ చేయించడం దారుణమన్నారు.నియోజకవర్గంలో ఇలాంటి ఎస్సీ, ఎస్టీ, బిసిలకు చెందిన చిరుద్యోగులను పదుల సంఖ్యలో ఆమె సిఫార్సు లతో అధికారులు తొలగించారని చెప్పారు.రాష్ట్ర చరిత్రలో ప్రథమం: గిరిజన సంక్షేమ శాఖ చరిత్ర లో ఇద్దరు విద్యార్థినుల మరణం,200 మంది విద్యార్ధినుల అస్వస్థత కు గురికావడం వల్ల కురుపాం గురుకుల పాఠశాల ని మూసివేయడం మొదటిసారి అన్నారు.విద్యార్ధుల మరణాలపై వైసిపి రాజకీయాలు చేయడం లేదన్నారు.మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గం లోనే పదిరోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజన విద్యార్థులు మరణించారని తెలిపారు. మానవత్వంతో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గురుకుల పాఠశాల లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అందజేశారని చెప్పారు.పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోనే ఇంతవరకు 14మంది విద్యార్ధులు మరణించారని తెలిపారు.ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోవడంతో తాము జాతీయ ఎస్టీ కమిషన్, మానవహక్కుల కమిషన్ లకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.నాలుగు సార్లు సిఎం గా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీనీ మంజూరు చేయించలేదన్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలో సిఎం వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ను తీసుకొచ్చారని చెప్పారు.వాటి నిర్మాణానికి నిధులు మంజూరు అనేది ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా చేయాల్సిందేనని చెప్పారు.సంధ్యారాణి లాంటి వ్యక్తి మంత్రి గా ఎంతకాలం వుంటే వైసిపికి అంత మేలు జరుగుతుందని రాజన్నదొర జోస్యం చెప్పారు.ఈ సమావేశంలో వైసిపి జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ గిరిరఘు, వైసిపి నాయకులు కాకి రంగా, ఎంఎస్ నారాయణ,ఎం.అప్పారావు,జి.వెంకటరమణ,కె.రామకృష్ణ పాల్గొన్నారు.