
(మన ధ్యాస న్యూస్ సీతారామపురం(అక్టోబర్ 19):
దీపావళి పండుగ సందర్బంగా తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని,పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని మండల ప్రజలందరికీ టిడిపి రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు మండల దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ అని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ బాణాసంచాను కాల్చుకోవాలని సూచించారు. పర్యావరణహితం కోసం పెద్దపెద్ద శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాకుండా వెలుగుదివ్వెలు విరజిమ్మే టపాసులు కాల్చాలన్నారు. తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంధకారంపై వెలుగు సాధించిన పండుగ దీపావళి అని తెలిపారు.అలాగే మండలంలోని ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.