
ఉదయగిరి, అక్టోబర్ 18(మన ధ్యాస న్యూస్)
ఉదయగిరి మండల కేంద్రం లోని కోళ్ల వీధికి చెందిన షేక్ జానీ భాషా – శ్రీమతి దిల్ షాద్ దంపతుల కుమార్తె వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని, మన ఫౌండేషన్ అధినేత(మన్నేటి వెంకట్ రెడ్డి ) మన ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుకగా స్థానిక నాయకుల ద్వారా పెళ్లికుమార్తెకు అందజేశారు.ఈ సందర్భంగా మన ఫౌండేషన్ అధినేత మన్నేటి గారు నూతన వధూవరులకు హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలుపుతూ, వారి జీవితాలు ఆనందం, ఐశ్వర్యం, పరస్పర ప్రేమతో నిండిపోవాలని ఆకాంక్షించారు.
అంతేకాక, మన ఫౌండేషన్ ద్వారా పేద మరియు అవసరమైన కుటుంబాలకు విద్య, వైద్యం, వివాహ సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా అందజేయబడుతున్నాయని తెలిపారు. సామాజిక సేవ పట్ల భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తామని మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో, మట్ల రామయ్య, లక్ష్మయ్య, రంతుజానీ ,స్థానిక నాయకులు, మన ఫౌండేషన్ సభ్యులు, పాల్గొన్నారు.