
కలిగిరి, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్ )://

స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర(SASA) కార్యక్రమం మూడవ శనివారంలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కలిగిరి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, కాలుష్య రహిత వాహనాలు( సైకిల్, ఎలక్ట్రికల్ వాహనాలు) నడపటం, సోలార్ పలకలు వాడటం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. జిల్లా పరిషత్ హై స్కూలు కలిగిరి నుండి సెంటర్ వరకు కాలుష్య రహిత వాహనాలతో ర్యాలీ, తదుపరి మానవహారం నిర్వహించి స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కె. ప్రత్యూష ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు, నాయకులు బి.కృష్ణారెడ్డి, బొల్లినేని వెంకట రామారావు, వై. సతీష్, పూసల వెంగప నాయుడు, సిహెచ్. సుబ్బారెడ్డి, కాకు. మహేష్, మొక్క హాజరాత్ రావు, కొప్పోలు కొండలరావు, జిల్లా పరిషత్ హై స్కూలు ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శి రవిచంద్ర, కలిగిరి సర్పంచ్ రాగి దివ్య, సచివాలయం సిబ్బంది మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.