
నెల్లూరు అక్టోబర్ 19 : (మన ధ్యాస న్యూస్ )://
దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ అజిత వేజండ్ల, ఏ ఎస్పీ, డీఎస్పీ సూచనలు, ఆదేశాల మేరకు నెల్లూరు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేశారు.ఈ సందర్బంగా రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రక్షణకు ప్రాధాన్యతనిస్తూ దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలు, నిల్వ, సరఫరా విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.అనుమతి లేని టపాసుల తయారీ, నిల్వ, విక్రయాలు నేరమని, అలాంటి వారిని గుర్తించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వ్యాపారి, తయారీదారు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. ప్రతి టపాసు షాపు మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి. ప్రతి దుకాణంలో 200 లీటర్ల నీరు, ఇసుక డ్రమ్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తప్పనిసరిగా ఉంచాలి అని తెలిపారు.తయారీ కేంద్రాలు, నిల్వ గోడాముల వద్ద శిక్షణ పొందిన కార్మికులు మాత్రమే పనిచేయాలని, పిల్లలను టపాసుల తయారీ లేదా విక్రయంలో పాల్గొననివ్వకూడదని హెచ్చరించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.పోలీస్, ఫైర్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తాయని, ఎక్కడైనా ఉల్లంఘనలు గమనించినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.ప్రజలు తమ పిల్లల భద్రత, ఆస్తుల రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని నెల్లూరు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు.