మన న్యూస్: ఎల్ బి నగర్. అంతర్జాతీయ భాష ఆంగ్లంపై నేటి విద్యార్థులు అవగాహన కలిగివుండటం ఆవశ్యకం.ఆ దిశగా విద్యార్థినీ విద్యార్థులను ఉత్తేజపరచడానికై,ప్రతిభను వెలికితీయటానికై నారాయణ విద్యాసంస్థ ,ఓ సీ ఎల్ బిన్ శాఖ ,చింతలకుంట,ఎల్ బి నగర్ నందు(ఎమ్ ఒ సి )మాస్టర్ ఓరియంట్ కాంటెక్స్ట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థ వివిధ శాఖల విద్యార్థులు పాల్గొని ఆంగ్లంపై వారికున్న ప్రతిభా పాఠవాలను ను గొప్పగా ప్రదర్శించారు.నేటి పోటి ప్రపంచానికి ధీటుగా ఎదగాలంటే ఆంగ్లంపై పూర్తి పట్టు సాధించాలంటూ ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ కృష్ణ ప్రసాద్ మోటూరి తెలిపారు.అనంతరం ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రశంశా పత్రాలను, బహుమతులను అందజేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాలల జీఎం గోపాల్ రెడ్డి,ఏజిఎం హేమాంబర్,ఆర్ఐ రవిప్రసాద్,ప్రిన్సిపాల్ రాజేశ్వరి దేవి,ఆర్ &డి డిపార్ట్మెంట్,సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్,కో ఆర్డినేటర్స్,ఏఓ ఫణిందర్ పాల్గొన్నారు.