మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.పిట్లం మండలంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పిట్లం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదలను ఆదుకునే పార్టీ అని ఆయన అన్నారు. ఇప్పటివరకు జుక్కల్ నియోజకవర్గంలో ఎంతో నిరుపేదల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మా రెడ్డి కృష్ణారెడ్డి,తదితరులు ఉన్నారు.