
మన ధ్యాస ,వెంకటగిరి, అక్టోబర్ 17: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసం ఎన్ జే ఆర్ భవన్ లో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను వారు పార్టీ నాయకులతో కలసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......... వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి 50 వేల 60 వేలమంది సంతకాల సేకరణ లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకురాలు కోడూరు కల్పలత, ఎస్ఈసి సభ్యులు డాక్టర్ బోలిగల మస్తాన్ యాదవ్, పాపకన్ను మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








