
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్)కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు రీజనల్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు జోయల్, మాస ఇమ్మానుయేల్, ప్రత్తిపాడు నియోజకవర్గ రీజనల్ చైర్మన్ షాలెం రాజు ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.అనంతరం రీజనల్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు జోయల్, మాస ఇమ్మానుయేల్, ప్రత్తిపాడు నియోజకవర్గ రీజనల్ చైర్మన్ షాలెం రాజు మాట్లాడుతూ, పాస్టర్లు ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉండాలని, పదవి అంటే హోదా కాదని బాధ్యతగా భావించాలని మండలంలో పాస్టర్ల అందరిని సమన్యాయం చేసుకొని వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అనంతరం శంఖవరం మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి. టి. పౌల్ మరియు పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దడాల యాకోబు మాట్లాడుతూ, జిల్లా రీజినల్ సభ్యులు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలోనే ఏ కార్యక్రమమైనా చేయడం జరుగుతుందని మీ సలహా సూచనలు మాకు ఎంతో అవసరమని మిమ్మలను మర్యాదపూర్వకంగా కలవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వి. ఎస్. ప్రకాష్, కార్యదర్శి దడాల జాన్సన్, సహాయ కార్యదర్శి గునపర్తి అపురూప్, కోశాధికారి ఎ. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.