
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండల కేంద్రం శంఖవరంలోని కృష్ణాలయం వీధిలో కారుకొండ శ్రీను గంగాభవాని దంపతులు తమ గృహంలో నెలకొల్పిన విజయ దుర్గ అమ్మవారు సుమారు 20 ఏళ్లుగా విశేష పూజలు అందుకుంటున్నారు. ఎంతో మహిమగల విజయదుర్గ అమ్మవారి ఆలయానికి స్థలం కోసం స్థానికులు,భక్తులు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ కు, స్థానిక టిడిపి నేత పర్వత సురేష్ కు తెలియపరచడం జరిగింది. పనితీరుతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, పర్వత సురేష్ చొరవతో అమ్మవారి ఆలయానికి సుమారు 6 సెంట్లు భూమిని కేటాయించారు. దీనితో బుధవారం కారుకొండ శ్రీను ఆలయ నిర్మాణానికి సిద్ధపడ్డారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సత్య ప్రభకు మహిళలు పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. ఆలయానికి స్థలం చేకూర్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ శంకుస్థాపన పురస్కరించుకుని ఉదయం నుండి పూజ్యం నాగేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో కారుకొండ శ్రీను గంగాభవాని దంపతులిచే విఘ్నేశ్వర పూజ, హోమాలు , పలు పూజలు, శంకుస్థాపన పూర్ణాహుతి వంటి పూజా కార్య క్రమాలు నిర్వహించారు అనంతరం ఉదయం 11:07 నిమిషాలకు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతుల మీదగా శిల శంఖ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కారుకొండ శ్రీను సాలువా లువేసి సన్మానించారు. అనంతరం విజయదశమి పురస్కరించుకుని కారుకొండ శ్రీను ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బద్ది రామారావు, వెన్న శివ, ఈగల దేవుళ్ళు, పోలం చిన్న, బొర్రా వాసు, రాజాల చిట్టిబాబు, బొమ్మిడి సత్యనారాయణ, కొయ్య రవణ, ఇ.వరప్రసాద్, కోలుబోయిన రాజు, భగవాన్, ఉప సర్పంచ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.