మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం మడలం యర్రవరం,పేరవరం,భద్రవరం
గ్రామాలలో పారిశుద్ధ్య పనులను డి యల్ పి ఓ బాలామణి పరిశీలించారు. యర్రవరం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రామరాజు వర్మతో కలిసి ,చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరివెక్షించారు.తడిచెత్త, పొడి చెత్త వేరు విధానాని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు,తదితర అంశాలపై ఆరాతీశారు. గ్రామాలలో పారిశుద్ధ్యపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.