మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
అలుపెరుగని పోరాటం అకుంఠిత దీక్ష మరియు అంకిత భావాలే ఆయుధాలుగా పోరాడి కృషిచేసిన ఏలేశ్వరం పట్టణంలో స్థానిక దిబ్బల పాలెం సాయి నగర్, కృష్ణలయం వీధిలోని గొలగాని పార్వతి, లోవరాజు దంపతుల కుమారుడు గొలగాని రాంబాబు అనుకున్న లక్ష్యాన్ని ఘనంగా సాధించారు. అతడి జీవితంలో అపజయాలతో సహవాసం, అటు తర్వాత తను జరిపిన పోరాటంతో విజయం మరియు ఉద్యోగ ప్రస్థానం నేటి యువతకు ఆదర్శం.2018 డీఎస్సీలో ఏపీ రెసిడెన్షియల్ లో టీజీటీ ఇంగ్లీష్ మరియు గ్రూప్ త్రీ లో పంచాయతీ సెక్రటరీ, 2019 లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీమరియు శానిటేషన్ సెక్రటరీ, 2020 ఏపీ సోషల్ వెల్ఫేర్ లో టీజీటీ ఇంగ్లీష్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 2025 మెగా డీఎస్సీలో ఇంగ్లీష్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ గా జిల్లా రెండవ ర్యాంకు, మరియు ప్రిన్సిపాల్ విభాగంలో రాష్ట్ర 28వ ర్యాంక్ సాధించడం విశేషం. తాను విద్యను అభ్యసించిన పాఠశాల అయిన ఏలేశ్వరం గవర్నమెంట్ హై స్కూల్ లో ఉపాధ్యాయుడు గా ఉద్యోగం సాధించడం తన అదృష్టమని ఈ సందర్భంగా గొలగాని రాంబాబు ఆనందంగా పేర్కొన్నారు. తన విజయాలకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.