
బంగారుపాళ్యం అక్టోబర్ 15 మన ద్యాస
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన సానుకూల సిఫార్సులను అమలు చేయని కారణంగా కామ్రేడ్ మహదేవయ్య నాయకత్వంలోని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో తక్షణమే కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సుల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2023 డిసెంబర్ నెలలో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి నాలుగు రోజులపాటు సమ్మెను నిర్వహించిన అనంతరం తపాలా శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చిన అనంతరం ఆ సమ్మెను నిలిపివేయడం జరిగింది. ఆనాడు జరిగిన సమ్మెకు నాయకత్వం వహించినందున కామ్రేడ్ మహదేవయ్య కి చార్జిషీట్ ఇచ్చి కక్షపూరితంగా ఈనెల 8వ తేదీన ఉద్యోగం నుండి తొలగించిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ మరియు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా అన్ని డివిజనల్ కార్యాలయాలు ముందర నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద స్ప్రే ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని ఎఐజిడిఎస్డియూ రాష్ట్ర యూనియన్ నాయకులు రాజేంద్ర ప్రసాద్, డివిజన్ సెక్రటరీ అరుణ, మదనపల్లె సెక్రటరీ శివ ప్రసాద్, కుప్పం సెక్రటరీ కార్తీక్, డివిజనల్ నాయకులు ఓం ప్రకాష్, రవి, రామాంజనేయులు, తదితర నాయకుల తో పాటు సుమారు 150 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరికి ఎన్ఎఫ్పిఈ యూనియన్ నాయకులు ఏవీ. భాస్కర్,సర్దార్, రామమూర్తి, మహదేవన్ మద్దతు తెలిపారు. ఇప్పటి కైన అన్యాయం గా విధుల నుండి తొలగించిన ఎఐజిడిఎస్డియూ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ మహాదేవయ్య గారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ పక్షం లో పోరాటం ముమ్మరం చేస్తామని ఎఐజిడిఎస్డియూ విజనల్ సెక్రటరీ అరుణ తెలిపారు.
