
కలిగిరి, అక్టోబర్ 15 :(మన ధ్యాస న్యూస్):///

కొండాపురం రోడ్డు మార్గం లో నర్సారెడ్డి పాలెం,కుడుములదిన్నెపాడు, గ్రామ సమీపంలో బోర్ వెల్స్ బండి వేగంగా వచ్చి మోటార్ సైకిల్ డీ కొట్టడం తో ముగ్గురు అక్కడి అక్కడే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మృతుల వివరాలు తూర్పు దూబగుంట గ్రామానికి చెందిన చవలముడి బాబు,34 మమత, 30, విభ ,10 వారు భార్య భర్తలు కూతురు ముగ్గురు చనిపోవడం జరిగింది. మరో చిన్నారి మేఘన కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ చిన్నారిని వింజమూరు ప్రజా వైద్యశాలకుతరలించారు, వీరు హైదరాబాద్ లో బేల్దారు పని చేసుకుంటూ జీవించే వారు వీరు రెండు రోజుల క్రితం బందువుల వివాహ నిమిత్తం సొంత గ్రామా మైన తూర్పుడూబాగుంట గ్రామనికి రావడం జరిగింది. వివాహ పని మీద కలిగిరి కి వచ్చి రిటన్లో వెళ్తూ న్న సమయం లో ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మన్నారు.
