
ఉదయగిరి అక్టోబర్ 13(మన ధ్యాస న్యూస్)://


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా భర్తీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం ఉదయగిరి మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో బాధ్యతలు తీసుకున్నారు.విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు, స్థానిక హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసన్,సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మండలంలో మెగా డీఎస్సి 2025 ద్వారా 15 మంది టీచర్లు సోమవారం విధులకు హాజరయ్యారన్నారు.

15 మంది స్కూల్ అసిస్టెంట్స్,ఉన్నారన్నారు. దీంతో అన్ని ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత కొంత మేర తీరినట్లు తెలిపారు.విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెడ్మాస్టర్ శ్రీనివాసన్ సూచించారు. నూతన స్కూల్ అసిస్టెంట్లు 15 మంది, షేక్, గులాం రసూల్ (హిందీ), ఏ.కుమార్(ఇంగ్లీష్), ఓ.సుప్రజ(ఇంగ్లీష్), ఎ. వెంకట సురేష్ (PE), ఏ పద్మజ (PS), బివి సుబ్బయ్య(PE), ఎస్ డి జమీర్ ఆహమద్ (E), ఎం ప్రసాద్ (PS), వై సుధాకర్ (T), కె గోపి(S.S), ఎస్ కే గాయాజుద్దీన్ (U), ఏం లక్ష్మయ్య (E), సిహెచ్ ఏడుకొండలు(PE), యన్ బి.పెంచలమ్మ( PS), ఎస్. కామేశ్వరి(H), ఈ నూతన టీచర్లకు పలువురు టీచర్లు,యూటీఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు.