మన న్యూస్: ఎల్బీనగర్ నియోజకవర్గం టీచర్స్ కాలనీ బి.డి.రెడ్డి గార్డెన్ లైన్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రక్కన పృథ్వీరాజ్ గురు స్వామి, సురేష్ గురు స్వామి, నగేష్ గురు స్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గణపతి పూజ,కుమార స్వామి పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు,భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ 18 మహా పడిపూజ కార్యక్రమంలో విగ్నేష్ గురు స్వామి,రామ కృష్ణ గురు స్వామిలు స్వర్ణ కంకణంను రాజేష్ గురుస్వామికి బహుకరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ గురు స్వామి,నాగార్జున గురు స్వామి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.