మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేప ల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం నోటు పుస్తకాలు,పెన్నులు ,చాక్లెట్లు అందజేశారు.అలాగే ఆయన మిత్రుడు సలీం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు అయిదువేల రూపాయలు విరాళంగా అందజేశారు.ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల్ రాజ్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థుల మధ్య పటేల్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.పాఠశాల తరపున ప్రదానోపాద్యా యులు, ఉపాద్యా యులు ,విద్యార్థులు గ్రామస్తులు శాలువా తో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె స్ పార్టీ నాయకులు మొహిద్దిన్ పటేల్, మొగుల గౌడ్,ఇస్మాయిల్ పటేల్ ,సిరాజ్ పటేల్, గంగాగౌడ్, పెంటన్న,శంకర్, చాంద్ పాషా,అంజా గౌడ్,సాయులు,అశోక్,రాంచందర్,రామగౌడ్,రాందాస్,ఇలియాస్,రమేష్, పర్వయ్య, శాదుల్, కిషన్, ఆఫీస్,బన్ను,బాల్ రాజ్ ,రహీమ్,చందర్ తదితరులు పాల్గొన్నారు.