
మన దేశ ,వెంకటాచలం ,అక్టోబర్ 9: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ఫ్యాక్టరీని శుక్రవారం సాయంత్రం ప్రారంభించడంతో పాటు నందగోకులం స్కూల్, గోశాలను సందర్శించనున్న సీఎం.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేష్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్.ఏర్పాట్లపై కంపెనీ ప్రతినిధులతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు .ఈ ప్రాంతంలో పండే బియ్యపు నూకలతో బయో ఇథనాల్ తయారీకి రూ.600 కోట్లతో విశ్వ సముద్ర కంపెనీ పరిశ్రమ ఏర్పాటుచేసినట్లు వెల్లడించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ప్రత్యక్షంగా, పరోక్షంగా 1000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటం సంతోషదాయకం అని అన్నారు.
