
మన ధ్యాస,కొడవలూరు , అక్టోబర్ 9: నార్త్ రాజుపాలెంలో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి:పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో గురువారం సాయంత్రం ఆమె వ్యాపారస్థులకు, ప్రజలకు జి ఎస్ టి 2.0 ప్రయోజనాలపై అవగహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జి ఎస్ టి 2.0 సంస్కరణలకు సంబంధించిన వివరాలతో కూడిన ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వ్యాపార కూడలిలో చిన్నపాటి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి షాపుల వద్దకు వెళ్లి ఏ ఏ వినియోగ వసతులపై ఎంత శాతం జి ఎస్ టి తగ్గింది అనే విషయాన్ని అటు వ్యాపారస్థులకు ఇటు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ....... జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని నేడు 2 స్లాబులకు తీసుకు రావడం పట్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి జీఎస్టీ ప్రతిఫలాలు అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికెళ్లి జీఎస్టీ 2. 0 ప్రయోజనాలను ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. గతంలో వ్యవసాయ ట్రాక్టర్ల పై 12 శాతం వున్న జీఎస్టీ ఇప్పుడు 5% శాతానికి తగ్గించారని, ట్రాక్టర్ల టైర్లు, ఇతర స్పేర్ పార్ట్స్ పై 18 శాతం వున్న జీఎస్టీ ప్రస్తుతం 5 శాతానికి తగ్గిందన్నారు. హార్వెస్టర్, రోటావేటర్ లాంటి వ్యవసాయ పరికరాలు, ఫర్టిలైజర్సు మరియు పురుగు మందులు, డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన స్ప్రింక్లర్ల పై గతంలో 12 నుంచి 18 శాతం వున్న జీఎస్టీ యిప్పుడు 5 శాతానికి తగ్గించిన విషయాన్ని ఆమె ప్రజలకు తెలిపారు. గతంలో బియ్యం. ఉప్పు, పప్పు, పాలు, గుడ్లు తదితర ఆహార వస్తువులపై 5 శాతం వున్న జీఎస్టీ ని ఇప్పుడు పూర్తిగా మినహాయించడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థులు ఉపయోగించే నోట్ బుక్స్, పెన్స్ లాంటి స్టేషనరీ ఉత్పత్తులపై గతంలో 5 నుంచి 12 శాతం వున్న జీఎస్టీ ని పూర్తిగా తొలగించి జీరో జీఎస్టీ జాబితాలో చేర్చారన్నారు. సామాన్యులు ఉపయోగించే 83 రకాల వస్తువుల మీద జీఎస్టీ తగ్గడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయన్నారు. గతంలో లైఫ్ ఇన్స్యూరెన్స్ మీద వున్న 18 శాతం జీఎస్టీ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి ఔషధాలపై వున్న12 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించారన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 15 వేల వరకు ఆదా అవుతుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా కేంద్రం జీఎస్టీ 2.0ను ప్రవేశపెట్టగా.. స్వర్ణాంధ్ర 2047 దిశగా సీఎం చంద్రబాబు సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా అడగలు వేస్తున్నారని 16 నెలల కూటమి పాలనలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, టిడిపి నాయకులు మందపాటి రమణారెడ్డి, సిద్దార్ధ, బాబ్జి, ఎల్లం దయాకర్ నాయుడు, టిడిపి ఉపాధ్యక్షులు కరకట్ట మల్లికార్జున, టి ఎన్ టి యు సి నాయకులు ఆరె విల్సన్, మండల ఎస్సి సెల అధ్యక్షులు కరకట్ట సోమేశ్వరరావు, మహిళా నాయకురాలు మల్లి లక్ష్మి టిడిపి క్లస్టర్, మరియు యూనిట్ ఇంచార్జీలు పాల్గొన్నారు.






