
వెంకటాచలం, అక్టోబర్ 09 :(మన ధ్యాస న్యూస్)://

వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెం వద్ద విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఈ నెల 10న సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు సమీపంలో షుగర్ ఫ్యాక్టరీ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సందర్శించారు. అధికారులతో కలిసి హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను పర్వేక్షించారు. సిఎం పర్యటన సందర్భంగా అప్రమత్తంగా వుండాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ,పోలీసు అధికారులతో పాటు టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ నాగరాజు, కోవూరు, బుచ్చి టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, బెజవాడ జగదీష్ , టిడిపి నాయకులు మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.
