
మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం ,అక్టోబర్ 8:- *బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీ గ్రాండ్ సక్సెస్. - *ఆటోలో ప్రయాణించిన వేమిరెడ్డి దంపతులు. - *కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్టంలో రహదారులపై గుంతలు పూడ్చడానికి 1400 కోట్లు వెచ్చించాం. * అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం. * గత ప్రభుత్వ హయాంలో 20 వేలున్న గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం 3 వేలకు తగ్గించింది.* ఆటో డ్రైవర్ల కోసం గత ప్రభుత్వం 260 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే... సీఎం చంద్రబాబు .. 435 కోట్లు వెచ్చించారు. - *కోవూరు నియోజకవర్గంలో 2,795 మంది ఆటో సోదరులకు 4 కోట్ల19 లక్షల 25 వేల ఆర్ధికసహాయం అందించాం. *బుచ్చిరెడ్డి పాళెం ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీలో వేమిరెడ్డి దంపతులు. ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్లుకూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టంలో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.. ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు బుచ్చిరెడ్డి పాళెం పట్టణం టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కు ఆటో డ్రైవర్లు మరియు తెలుగుదేశం నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పుష్ప గుచ్చాలతో సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. అనంతరం ప్రసన్న అనే మహిళా ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చొని ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అటు టోల్ ప్లాజా నుంచి ఇటు నారాయణాద్రి లే అవుట్ వరకు బుచ్చి పట్టణం మీదుగా దాదాపు 500 లకు పైగా ఆటోలతో ఆటో సోదరులు నిర్వహించిన భారీ ర్యాలీలో సంక్షేమ సారధి చంద్రబాబు జిందాబాద్, వేమిరెడ్డి దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో బుచ్చిరెడ్డి పాళెం పట్టణ ప్రతిధ్వనించాయి. ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ....... ప్రజా రవాణా రంగంలో లో ఆర్టీసీకి ఎంత ప్రాధాన్యత వుందో ఆటో వ్యవస్థ కూడా అంతే ముఖ్యమైందన్నారు. రవాణా కోసం ప్రజలు ఆర్టీసీ బస్సుల తర్వాత ఎక్కువగా ఎక్కేది ఆటోలేనన్నారు. రాష్టం ఆర్ధిక ఇబ్బందులలో వున్నా ఆటో సోదరులను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో “ఆటో డ్రైవర్ల సేవలో” పధకాన్ని అమలు చేసి సిఎం చంద్రబాబు నాయుడు కార్మికుల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు.గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10 వేలు యిస్తే కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ఆటో సోదరుల అకౌంట్లలో 15 వేలు జమ చేసి ఆదుకున్నారనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో సోదరుల ఖాతాల్లో రూ.435 కోట్లు అందజేస్తే ఒక్క నెల్లూరు జిల్లాలోనే 17వేల 409 వేల మందికి 26.11 కోట్లు జమ చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ...... ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే సంకల్పంతో కోవూరు నియోజకవర్గంలో 2 వేల,795 మంది ఆటో సోదరులకు 4 కోట్ల 19 లక్షల 25 వేల ఆర్ధిక సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆమె ఆటో సోదరుల పక్షాన ధన్యవాదాలు తెలియచేసారు. 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన సంక్షేమ పధకాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని పెన్షన్ల పెంపు, దీపం 2 పధకం ద్వారా ఏడాదికి మూడు సిలెండర్లు, అన్నదాత సుఖీభవ, మత్స్యకారసేవలో తల్లికి వందనం తదితర సంక్షేమ పధకాల ద్వారా ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కాలంటేనే భయపడే పడే పరిస్థితి వుండేదన్నారు. గతంలో 20 వేలున్న గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం 3 వేలకు తగ్గించిందన్నారు. ఆటో డ్రైవర్ల కోసం గత ప్రభుత్వం 260 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే... సీఎం చంద్రబాబు గారు.. 435 కోట్లు అందించారన్నారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అధికారం చేపట్టగానే తొలి సంతకం ద్వారా మెగా డిఎస్సికి శ్రీకారం చుట్టి రాష్ట వ్యాప్తంగా 15,941 మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టిందన్నారు. కోవూరు నియోజకవర్గంలో 67 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారన్నారు. ఆర్థికంగా సవాళ్లున్నా.. ఊహించని స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి అందిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లో టాప్లో నిలిపేలా కష్టపడుతున్న సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ కు అండగా నిలిచి స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి, వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి, బుచ్చి అగ్రికల్చర్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మెన్ ఏటూరి శివరామ కృష్ణారెడ్డి, బుచ్చి వైస్ చైర్మన్లు శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, బుచ్చి రూరల్ మరియు అర్బన్ టిడిపి అధ్యక్షులు బెజవాడ జగదీష్ , గుత్తా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు టంగుటూరు మల్లారెడ్డి, కోవూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బత్తల హరికృష్ణ, ఎంవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.





