తవణంపల్లి డిసెంబర్ 4 మన న్యూస్
తవణంపల్లి మండల కేంద్రం నందు భవిత కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ఎంఈఓ హేమలత హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు అనంతరం ఎంఈఓ హేమలత మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరూ భవిత కేంద్రానికి వచ్చి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఉచితంగా పొందవచ్చును భవిత కేంద్రానికి వచ్చి పిల్లలకు పది నెలలకు మూడు వేల రూపాయలు అందివ్వడం జరుగుతుందని అలాగే ఎంఈఓ హేమలత, ఎంఈఓ త్యాగరాజు రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తవణంపల్లి హెచ్ఎం దేవరాజుల రెడ్డి, సహిత విద్య ఉపాధ్యాయులు టి దేవేంద్ర, యం దిలీప్ పాల్గొన్నారు.