
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్” కార్యక్రమంలో కనుమళ్ల గ్రామ పంచాయతీకి గౌరవప్రదమైన అవార్డు లభించింది. స్వచ్ఛ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన కనుమళ్ల పంచాయతీకి జిల్లా కలెక్టర్ అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా అవార్డును కనుమళ్ల సర్పంచ్, గ్రామ కార్యదర్శి స్వీకరించగా, సింగరాయకొండ మండల పరిషత్ అధ్యక్షురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రామ శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలలో స్వచ్ఛతపై అవగాహన వంటి అంశాలలో కనుమళ్ల పంచాయతీ అత్యుత్తమ పనితీరు కనబరచినందుకు ఈ అవార్డు లభించింది.గ్రామ ప్రజలు, సిబ్బంది, నాయకులు ఈ విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.