మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;ఏలేశ్వరం లింగంపర్తి రోడ్డు,భారత్ గ్యాస్ ఎదురుగా డాక్టర్ బి.సురేష్ బాబు ఎంబిబిఎస్,ఎండి జనరల్ చే సూర్య హాస్పిటల్ ను ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త ఊర కృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ భారత్ గ్యాస్ ఎదురుగా నూతనంగా సూర్య హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగిందని,మా హాస్పిటల్ షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, పక్షవాతం, కీళ్లవాతం,విష జ్వరాలు,జనరల్ కేసులన్నీ ప్రతిరోజు చూడడం జరుగుతుందని, అంతేకాకుండా హాస్పిటల్ లో వార్డులు,ల్యాబ్స్ సౌకర్యం,మెడికల్ షాపు సదుపాయం హాస్పిటల్ లోనే ఉన్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం అమ్మ ఆసుపత్రి వైద్యులు సత్యనారాయణ దొర,ఫిజియోథెరపీ వైద్యులు నాయుడు,శ్రీకృష్ణ ఆస్పటల్ ఎముకుల వైద్యులు ఉమా మహేష్, డాక్టర్లు గోపి శ్రీనివాస్,సజ్జి సునీల్, శ్రీకాంత్ రెడ్డి, ఉదయ కాంత్, ల్యాబ్ టెక్నీషియన్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.