మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహల నిమజ్జన వేడుకలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారిని నిర్వాహకులు ఈ శోభాయాత్రలో ప్రత్యేక వాహనంపై అమ్మవారి విగ్రహాన్ని ముస్తాబు చేసి ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా మహిళల మంగళహారతులతో
డప్పు చప్పులు,డీజే మోతలు,శక్తివ్యాసాలు,కోలాటం వంటి సాంప్రదాయక నృత్యాల మధ్య భారీగా ఊరేగింపుగా తో తీసుకువచ్చి ప్రత్యేక పూజల అనంతరం ఏలేరు జలాశయం కాలవలో నిమజ్జనం చేశారు. మరోవైపు నిమజ్జన వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏలేశ్వరం పోలీస్ రెవిన్యూ,సిబ్బంది ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.